పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరామాదుల వంశము

 •  
 •  
 •  

9-346-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సుధపైఁ బుట్టెడు వార్త లాకర్ణించు-
కొఱకునై రాముండు గూఢవృత్తి
డురేయి దిరుగుచో నాగరజనులలో-
నొక్కఁడు దన సతి యొప్పకున్న
"నొరునింటఁ గాపురంబున్న చంచలురాలిఁ-
బాయంగలేక చేట్ట నేమి
తా వెఱ్ఱి యగు రామరణీశ్వరుండనే-
బేల! పొ"మ్మను మాట బిట్టు పలుక

9-346.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నాలకించి మఱియు నా మాట చారుల
లన జగములోనఁ లుగఁ దెలిసి
సీత నిద్రపోవఁ జెప్పక వాల్మీకి
ర్ణశాలఁ బెట్టఁ నిచె రాత్రి.

టీకా:

వసుధ = లోకము; పైన్ = అంది; పుట్టెడు = కలిగెడు; వార్తలున్ = విశేషములు; ఆకర్ణించు = వినుట; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; రాముండు = రాముడు; గూఢ = రహస్య; వృత్తిన్ = సంచారమున; నడురేయి = అర్థరాత్రి; తిరుగుచోన్ = తిరుగుతుండగ; నాగరజనుల = పౌరుల {నాగరజనులు - నగరములోనుండెడి జనులు, పౌరులు}; లోన్ = అందు; ఒక్కడు = ఒకానొకడు; తన = తనయొక్క; సతి = భార్య; ఒప్పక = సరిగలేక; ఉన్నన్ = ఉండగ; ఒరున్ = ఇతరుని; ఇంటన్ = నివాసములో; కాపురంబున్న = నివాసించిన; చంచలురాలిన్ = చంచలస్వభావిని; పాయంగన్ = విడువ; లేక = లేకపోవుటచేత; చేపట్టన్ = ఏలుకొనుటకు; ఏమి = ఏమైనా; తాన్ = తను; వెఱ్ఱి = వెఱ్ఱివాడు; అగు = అయిన; రామ = రాముడు అనెడి; ధరణీశ్వరుండనే = రాజునా ఏమి, కాదు {ధరణీశ్వరుడు - ధరణి (భూమికి) ప్రభువు, రాజు}; బేల = పడతి; పొమ్ము = వెళ్ళిపో; అను = అనెడి; మాటన్ = మాటలతో; బిట్టుపలుక = కేకలేస్తుండగ; ఆలించి = విని.
మఱియున్ = అంతేకాక; ఆ = ఆ; మాట = విషయము; చారుల = వేగుల; వలన = వలన; జగము = లోకము; లోన్ = అందు; కలుగన్ = వ్యాపించి ఉండుట; తెలిసి = తెలిసికొని; సీత = సీతాదేవి; నిద్రపోవన్ = నిద్రించుచుండగ; చెప్పక = చెప్పకుండగ; వాల్మీకి = వాల్మీకియొక్క; పర్ణశాలన్ = ఆశ్రమములో; పెట్టన్ = విడిచిపెట్టిరమ్మని; పనిచెన్ = ఆజ్ఞాపించెను; రాత్రి = రాత్రిసమయమునందు.

భావము:

రాజ్యంలో జరిగే విశేషాలు స్వయంగా తెలుసుకోడానికి రాముడు మారువేషంలో తిరుగుతున్నాడు. అర్థరాత్రి ప్రజల్లో ఒకడు భార్యతో దెబ్బలాడి, “పరాయి ఇంటిలో కొన్నాళ్ళు కాపురం చేసిన చంచలురాలైన భార్యను ఏలుకోడానికి నేనేమైనా వెఱ్ఱిరాముడను అనుకున్నావా? పోపో.” అని కేకలేస్తుంటే శ్రీరాముడు విన్నాడు. అంతేకాక, చారుల ద్వారా ఈ విషయం లోకంలో వ్యాపించి ఉందని తెలిసికొన్నాడు. ఆదమరచి నిద్రిస్తున్న సీతాదేవిని చెప్పకుండ రాత్రివేళ వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు.