పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-342-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"గవంతుఁడగు రామద్రుండు ప్రీతితో-
దేవోత్తముని సర్వదేవమయునిఁ
నుఁదాన కూర్చి యధ్వరములు చేసెను-
హోతకుఁ దూరుపు నుత్తరంబు
సామగాయకునికి మనదిగ్భాగంబు-
బ్రహ్మకుఁ గ్రమమునఁ డమ రెల్ల
ధ్వర్యునకు శేష మాచార్యునకు నిచ్చి-
సొమ్ములఁ బంచి భూసురుల కొసఁగి

9-342.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నదు రెండు పుట్టంబులు నకు నయిన
మెలఁత మంగళసూత్రంబు మినుకుఁ దక్క
వినతుఁడై యుండె; నా రాము వితరణంబు
పాండవోత్తమ! యేమని లుకవచ్చు?

టీకా:

భగవంతుడు = సాక్షాత్ భగవంతుడే; అగు = ఐన; రామభద్రుండు = శ్రీరాముడు; ప్రీతితో = ఇష్టపూర్తిగా; దేవోత్తముని = విష్ణుమూర్తి {దేవోత్తముడు - దేవుళ్ళలో ఉత్తముడు, విష్ణువు}; సర్వదేవమయునిన్ = విష్ణుమూర్తి {సర్వదేవమయుడు - సమస్తమైన దేవతలు తానైన వాడు, విష్ణువు}; తనున్ = తనను; తాన = తనే; కూర్చి = ఉద్దేశించి, గురించి; అధ్వరములు = యజ్ఞములు; చేసెను = చేసెను; హోత = హోత; కున్ = కు; తూరపున్ = తూర్పుభాగము {హోత - ఋగ్వేదము తెలిసిన ఋత్విక్కు}; ఉత్తరంబున్ = ఉత్తరపు భాగము; సామగాయకుని = సామవేదముపాడెడివాని; కిన్ = కి; శమన = దక్షిణపు; దిక్ = దిక్కు; భాగంబున్ = భాగమును; బ్రహ్మ = ఋత్వికుని; కున్ = కి; పడమర = పడమరవైపు భాగము; ఎల్లన్ = అంతటిని; అధ్వర్యున్ = యాగాధ్వర్యముచేయువాని; కు = కి; శేషమున్ = మిగిలినది; ఆచార్యున్ = గురువున; కున్ = కు; ఇచ్చి = ఇచ్చివేసి; సొమ్ములన్ = సంపదలను; పంచి = పంచిపెట్టి; భూసురుల్ = విప్రుల; కున్ = కు; ఒసగి = ఇచ్చివేసి.
తనదు = తనయొక్క; రెండు = రెండు; పుట్టంబులున్ = వస్త్రములు; తన = తన; కున్ = కు; అయిన = చెందిన; మెలత = భార్య; మంగళసూత్రంబు = మంగళసూత్రపు; మినుకు = బిళ్ళ; తక్క = తప్పించి; వినతుడు = వినయముకలవాడు; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; రాము = శ్రీరాముని; వితరణంబు = దానశీలత; పాండవోత్తమ = పరీక్షిత్తు {పాండవోత్తముడు - పాండువంశము నందు ఉత్తముడు, పరీక్షిత్తు}; ఏమని = ఎంతని; పలుకవచ్చు = పొగడగలము.

భావము:

“ఓ పాండవోత్తమా! పరీక్షిత్తూ! సాక్షాత్తు భగవంతుడే ఐన శ్రీరాముడు వినయవంతుడు ప్రీతితో తానే అయిన విష్ణుమూర్తి గురించి అనేక యాగాలు చేసాడు. హోతకు తూర్పుదిక్కు, సామగానం చేసిన వానికి ఉత్తరపు దిక్కు, ఋత్వికునికి దక్షిణపు దిక్కు, అధ్వర్యనికి పడమర దిక్కు, మిగిలినది గురువునకు ఇచ్చివేసాడు. తనకు రెండు వస్త్రాలు, తన భార్యకు మంగళసూత్రంబిళ్ళ ఉంచుకుని మిగిలిన సంపదలను విప్రులకు పంచిపెట్టాడు. ఆ శ్రీరాముని దానశీలత ఎంతని పొగడగలము.