పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-340-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"భ్రాతృజనుల యందు బంధువులందును
ప్రజల యందు రాజభావ మొంది
యెట్లు మెలఁగె? రాఘవేశ్వరుం డెవ్వనిఁ
గూర్చి క్రతువు లెట్లు గోరి చేసె?"

టీకా:

భాత్రు = సోదరుల; జనుల = అందరి; అందున్ = ఎడ; బంధువులు = బంధువులు; అందును = ఎడ; ప్రజల = లోకుల; అందున్ = ఎడ; రాజభావము = రాజుననెడి తలపు; ఒంది = కలిగుండి; ఎట్లు = ఏ విధముగ; మెలగెన్ = మసలుకొనెను; రాఘవేశ్వరుండు = శ్రీరాముడు; ఎవ్వనిన్ = ఎవరిని; కూర్చి = ఉద్దేశించి; క్రతువులు = యాగములు; ఎట్లు = ఏ విధముగ; కోరి = పూని; చేసెన్ = ఆచరించెను.

భావము:

“శ్రీరాముడు సోదరులు, బంధువులు, లోకులు ఎడ మహారాజుగా ఎలా మసిలాడు. ఎవరిని ఉద్దేశించి యాగాలు ఏ విధంగా ఆచరించాడు.”