పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-337-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు, నా రామచంద్రుండు రాజర్షిచరితుండును, నిజధర్మనిరతుండును, నేకపత్నీవ్రతుండును, సర్వలోకసమ్మతుండును నగుచు ధర్మవిరోధంబు గాకుండఁ గోరిక లనుభవించుచుఁ ద్రేతాయుగంబైన గృతయుగధర్మంబుఁ గావించుచు, బాలమరణంబు మొదలగు నరిష్టంబులు ప్రజలకుఁ గలుగకుండ రాజ్యంబుచేయుచుండె; నయ్యెడ

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; రామచంద్రుండు = శ్రీరాముడు; రాజర్షి = రాజఋషులవంటి; చరితుండును = నడవడికలవాడు; నిజ = స్వ; ధర్మ = ధర్మమునందు; నిరతుండును = నిష్ఠకలవాడు; ఏకపత్నీవ్రతుండును = ఏకపత్నీవ్రతుడు {ఏకపత్నీవ్రతుడు - జీవితములో ఒకే భార్య అనెడి వ్రతదీక్ష కలవాడు}; సర్వ = సమస్తమైన; లోక = లోకులచేత; సమ్మతుండును = అంగీకరింపబడువాడు; అగుచు = ఔతూ; ధర్మ = దర్మమునకు; విరోధంబు = వ్యతిరేకము; కాకుండన్ = కానివిధముననే; కోరికలున్ = కోరికలను; అనుభవించుచున్ = తీర్చుకొంటూ; త్రేతాయుగంబున్ = త్రేతాయుగము; ఐనన్ = అయినను; కృతయుగ = కృతయుగపు; ధర్మంబున్ = ధర్మములను; కావించుచు = నడపించుచు; బాలమరణంబు = చిన్నపిల్లలుచనిపోవుట; మొదలగు = మున్నగు; అరిష్టంబులు = కీడులు; ప్రజల = లోకుల; కున్ = కు; కలుగకుండ = కలగనివ్వకుండ; రాజ్యంబున్ = రాజ్యమును; చేయుచుండెన్ = ఏలుచుండెను; అయ్యెడ = అప్పుడు.

భావము:

ఇంకను, ఆ శ్రీరాముడు రాజఋషివంటివాడు; స్వధర్మంలో నిష్ఠ కలవాడు; ఏకపత్నీవ్రతుడు; లోకులందరికీ ఆమోదయోగ్యుడు; ధర్మమువ్యతిరేకం కాని విధంగానే కోరికలను తీర్చుకొంటూ త్రేతాయుగం అయినా కృతయుగ ధర్మాలను నడపిస్తూ ఏలుతున్నాడు; చిన్నపిల్లలు చనిపోవడం లాంటి లోకులకు కీడులు కలగనివ్వకుండ రాజ్యం ఏలుతున్నాడు. అప్పుడు.