పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-333.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డిఁది వ్రేఁగు మానెఁ రి గిరి కిటి నాగ
మఠములకుఁ బ్రజల లఁక మానె;
రామచంద్రవిభుఁడు రాజేంద్రరత్నంబు
రణిభరణరేఖఁ దాల్చు నపుడు.

టీకా:

కలగుట = సంక్షోభములు; ఎల్లను = సర్వమును; మానెన్ = లేకుండపోయినవి; జలధులు = సముద్రములు {సప్తసముద్రములు - 1లవణ 2ఇక్షు 3సురా 4ఘృత 5దధి 6క్షీర 7జల సముద్రములు}; ఏడింటికి = ఏడింటికి (7); చలనంబు = కంపించుటలు; మానెన్ = లేకుండపోయినవి; భూచక్రమున్ = భూమండలమున; కున్ = కు; జాగరూకత = జాగ్రత్తపడుట; మానెన్ = అవసరములేకపోయెను; జలజలోచనున్ = విష్ణుమూర్తి; కున్ = కి; దీనభావము = దైన్యము; మానెన్ = లేకుండపోయినది; దిక్పతుల్ = దిక్పాలకుల; కున్ = కు; మాసి = వెలవెలపోయి; ఉండుట = ఉండుట; మానెన్ = పోయినది; మార్తాండ = సూర్యునికి; విధులకున్ = చంద్రునికి; కావిరి = నలుపురంగు; మానెన్ = పోయినది; దిక్ = దిక్కులు; గగనముల్ = ఆకాశముల; కున్ = కు; ఉడిగిపోవుట = ఎడిపోవుట; మానెన్ = పోయినది; ఉర్వీరుహంబుల = చెట్ల {ఉర్వీరుహము - ఉర్వి (భూమి)యందు పుట్టునది, చెట్టు}; కున్ = కు; అడగుట = అణగిపోవుట; మనెన్ = పోయినది; త్రేతాగ్నుల్ = త్రేతాగ్నుల {త్రేతాగ్నులు - 1గార్హపత్యము 2దక్షిణాగ్ని 3ఆహవనీయము అనెడి మూడగ్నులు}; కునున్ = కు; కడిది = ఎక్కువ; వ్రేగు = భారము.
మానెన్ = పోయినది; కరి = దిగ్గజములకు; గిరి = కులపర్వతములకు; కిటి = వరాహమూర్తికి; నాగ = ఆదిశేషునకు; కమఠముల = కూర్మమూర్తుల; కున్ = కు; ప్రజల్ = లోకుల; కున్ = కు; అలక = కలత; మానెన్ = పోయినది; రామచంద్రవిభుడు = శ్రీరామప్రభువు; రాజ = రాజులలో; ఇంద్ర = శ్రేష్ఠులలో; రత్నంబు = ఉత్తముడు; ధరణిభరణరేఖలన్ = భూభారమును; తాల్చున్ = వహించెడి; అపుడున్ = అప్పుడు.

భావము:

ఆ రామరాజ్యంలో సంక్షోభాలు లేవు. సప్త సముద్రాలు కంపించడం లేదు. భూమండలం నిర్భయంగా ఉంది. పాపులు లేకపోడంతో విష్ణుమూర్తి జాగరూకత అవసరం లేకపోయింది. దిక్పాలకులకు దైన్యం లేదు. సూర్య చంద్రులకు వెలవెల పోవటం లేదు. దిక్కులు ఆకాశాలకు కావిరంగు పట్టటంలేదు. చెట్ల ఎడిపోవుటం లేదు. త్రేతాగ్నులు అణగిపోవుటం లేదు. భూభారం తగ్గడంతో భూమిని మోసే ఆ దిగ్గజాలకు, కులపర్వతాలకు, వరాహమూర్తికి, ఆదిశేషుడికి, కూర్మమూర్తికి భారం తగ్గిపోయింది. లోకులకు కలతలు లేవు. అలా శ్రీరాముడు రాజ్యం ఏలాడు. అప్పుడు...