పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-325-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తఁడే రామనరేంద్రుఁ డీ యబలకా యింద్రారి ఖండించె న
ల్లతఁడే లక్ష్మణుఁ డాతఁడే కపివరుం డా పొంతవాఁడే మరు
త్సుతుఁ డా చెంగట నా విభీషణుఁ" డటంచుం చేతులం జూపుచున్
తులెల్లం బరికించి చూచిరి పురీసౌధాగ్రభాగంబులన్.

టీకా:

ఇతడే = ఇతనే; రామ = రాముడు అనెడి; నరేంద్రుడు = రాజు; ఈ = ఈ; అబల = స్త్రీ; కిన్ = కి; ఆ = ఆ; ఇంద్రారిన్ = రావణుని; ఖండించెన్ = సంహరించెను; అల్ల = అదిగో; అతడె = అతనె; లక్ష్మణుడు = లక్ష్మణుడు; ఆతడే = అతనే; కపివరుండు = సుగ్రీవుడు; ఆ = ఆ; పొంతవాడే = పక్కవాడే; మరుత్సుతుడు = ఆంజనేయుడు {మరుత్సుతుడు - వాయుపుత్రుడు, హనుమంతుడు}; ఆ = ఆ; చెంగటన్ = పక్కన; ఆ = ఆ; విభీషణుడు = విభీషణుడు; అట = అని; అంచున్ = అనుచు; చేతులన్ = చేతులతో; చూపుచున్ = చూపించుచు; సతులు = స్త్రీలు; ఎల్లన్ = అందరు; పరికించి = పరిశీలనగా; చూచిరి = చూసిరి; పురీ = పట్టణములోని; సౌధ = మేడల; అగ్రభాగంబులన్ = డాబాలపైనుంచి.

భావము:

నగరకాంతలు అందరూ భవనాలపైకెక్కి చూస్తూ, “ఇతనే రాజు రాముడు. ఇదిగో సీతా దేవి, రాముడు ఈమెకోసమే రావణుణ్ణి సంహరించాడు. అడిగో లక్ష్మణుడు, సుగ్రీవుడు అడిగో, ఆ పక్కవాడే ఆంజనేయుడు, ఆ పక్కన ఆ విభీషణుడు అని అంటూ చేతులతో చూపించుకుంటూ పరిశీలనగా చూడసాగారు.