పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-321-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వీథులు చక్కఁ గావించి తోయంబులు-
ల్లి రంభా స్తంభయము నిలిపి
ట్టుజీరలు చుట్టి హుతోరణంబులుఁ-
లువడంబులు మేలుట్లుఁ గట్టి
వేదిక లలికించి వివిధరత్నంబుల-
మ్రుగ్గులు పలుచందములుగఁ బెట్టి
లయ గోడల రామథలెల్ల వ్రాయించి-
ప్రాసాదముల దేవవనములను

9-321.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గోపురంబుల బంగారు కుండ లెత్తి
యెల్ల వాకిండ్ల గానిక లేర్పరించి
నులు గైచేసి తూర్యఘోములతోడ
నెదురు నడతెంచి రా రాఘవేంద్రుకడకు.

టీకా:

వీథులున్ = దారులు; చక్కన్ = చక్కగా; కావించి = చేసి; తోయంబులున్ = నీళ్ళు; చల్లి = కళ్ళాపిజల్లి; రంభా = అరటి; స్తంభ = స్తంభముల; చయమున్ = సమూహములను; నిలిపి = నిలబెట్టి; పట్టుజీరలున్ = పట్టుబట్టలు; చుట్టి = కట్టి; బహు = అనేకమైన; తోరణంబులు = తోరణములు; కలువడంబులు = బంగారు కలువపూలదండలు; మేలుకట్టులున్ = చాందినీలు; కట్టి = కట్టి; వేదికల్ = అరుగులు; అలికించి = అలికించి {అలికి - అలకుట చేసి - మట్టిగచ్చు లను మరల మట్టి పేడలతో (గోడలకు సున్నము వేసినట్లు) మెత్తుట}; వివిధ = రకరకముల; రత్నంబుల = రత్నాల; మ్రుగ్గులున్ = ముగ్గులను; పలు = అనేక; చందంబులుగన్ = విధములైనవి; పెట్టి = వేసి; కలయ = అంతట; గోడల = గోడలపైన; రామ = రాముని; కథలు = కథలు; ఎల్లన్ = సర్వము; వ్రాయించి = వ్రాయించి; ప్రాసాదములన్ = భవనములయొక్క; దేవభవనములను = దేవాలయములయొక్క.
గోపురంబులన్ = గోపురములమీద; బంగారు = బంగారపు; కుండలు = కలశములు; ఎత్తి = పెట్టి; ఎల్ల = అన్ని; వాకిండ్లన్ = వాకిళ్ళలోను; కానికలు = కానుకలు; ఏర్పరచి = అమర్చి; జనులు = ప్రజలు; కైచేసి = నమస్కరించి; తూర్యఘోషముల = మంగళవాయిద్యముల; తోడన్ = తోటి; ఎదురునడతెంచిరి = ఎదుర్కోలుచేయ వెళ్ళిరి; ఆ = ఆ; రాఘవేంద్రున్ = శ్రీరాముని {రాఘవేంద్రుడు - రఘువంశపు ప్రభువు, రాముడు}; కడ = వద్ద; కున్ = కు.

భావము:

వీధులు అన్నీ చక్కగా తుడిచి కళ్ళాపిజల్లారు. అరటి స్తంభములు నిలబెట్టి పట్టుబట్టలు కట్టారు. తోరణాలు, బంగారు కలువపూల దండలు, చాందినీలు కట్టారు. అరుగులు అలికించి రత్నాల ముగ్గులు వేసారు. గోడలపై రామకథలు వ్రాయించారు. భవనాల దేవాలయాల, గోపురాల మీద బంగారు కలశాలు పెట్టారు, వాకిళ్ళలో కానుకలు అమర్చారు. ఇలా సర్వాంగ సుందరంగా పట్టణాన్ని అలంకరించి, ప్రజలు నమస్కరించి, మంగళ వాయిద్యాలతో శ్రీరాముడికి ఎదుర్కోలు చేసారు.