పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-320-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పుష్పకారూఢుండై, కపి బలంబులు చేరికొలువ. శ్రీరాముం డయోధ్యకుం జనియె; నంతకు మున్న యప్పురంబునందు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పుష్పక = పుష్పకవిమానమును; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; కపి = వానర; బలంబులున్ = సేనలు; చేరికొలువన్ = సేవించుచుండగ; శ్రీరాముండు = శ్రీరాముడు; అయోధ్య = అయోధ్యానగరమున; కున్ = కు; చనియె = వెళ్ళెను; అంత = దాని; కున్ = కి; మున్న = ముందే; ఆ = ఆ; పురంబున్ = నగరము; అందున్ = లో.

భావము:

ఈ విధంగ పుష్పకవిమానం ఎక్కి వానర సేనలు సేవిస్తుండగా శ్రీరాముడు అయోధ్యాకు వెళ్ళాడు. దానికి ముందే ఆ నగరంలో.