పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-319.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సిఁడి కేడె మర్థి ల్లూకపతి మోచి
కొలువఁ బుష్పకంబు వెయ నెక్కి
గ్రహము లెల్లఁ గొలువఁ డు నొప్పు సంపూర్ణ
చంద్రుపగిది రామచంద్రుఁ డొప్పె.

టీకా:

కవగూడి = జంటగాకలిసి; ఇరు = రెండు (2); దెసన్ = పక్కలను; కపిరాజు = సుగ్రీవుడు; రాక్షసరాజున్ = విభీషణుడు; ఒక్కటన్ = కూడి; చామరంబులు = చామరములు {చామరము - చమరీమృగముకుచ్చుతో చేయబడి గాలి విసురుటకు ఉపయోగపడెడి సాధనము, తెల్లగా ఉండును కనుక వింజామరము}; వీవన్ = వీచుచుండగ; హనుమంతుడు = హనుమంతుడు; అతి = మిక్కిలి; ధవళ = తెల్లని; అతపత్రమున్ = గొడుగు; పట్ట = పట్టుచుండగ; పాదుకల్ = పావుకోళ్ళు, కాలిజోళ్ళు; భరతుండు = భరతుడు; భక్తిన్ = భక్తితో; తేర = తీసుకురాగ; శత్రుఘ్నుడు = శత్రుఘ్నుడు; అమ్ములు = బాణములు; చాపంబు = విల్లు; కొనిరాగ = తీసుకురాగా; సౌమిత్రి = లక్ష్మణుడు {సౌమిత్రి - సుమిత్రకొడుకు, లక్ష్మణుడు}; భృత్యుడు = సేవకుడు; ఐ = అయ్యి; చనువు = దగ్గరతనము; చూపన్ = చూపించుతుండగ; జల = నీటి; పాత్రన్ = కలశమును; చేబట్టి = చేతిలోపట్టుకుని; జనకజ = జానకీదేవి; కూడిరాన్ = కూడా వస్తుండగ; కాంచన = బంగారపు; ఖడ్గము = కత్తిని; అంగదుడ = అంగదుడు; మోవన్ = మోయుచుండగా; పసిడి = బంగారపు.
కేడెమున్ = డాలును; అర్థిన్ = కోరి; భల్లూకపతి = జాంబవంతుడు; మోచి = మోయుచు; కొలువన్ = సేవించుచుండగ; పుష్పకంబున్ = పుష్పకవిమానమును; వెలయన్ = ప్రకాశించుచు; ఎక్కి = అధిరోహించి; గ్రహములు = గ్రహములు; ఎల్లన్ = సమస్తము; కొలువన్ = సేవించుచుండగ; కడున్ = మిక్కిలి; ఒప్పు = చక్కగానుండెడి; సంపూర్ఱ = నిండు; చంద్రున్ = చంద్రుని; పగిదిన్ = వలె; రామచంద్రుడు = శ్రీరాముడు; ఒప్పెన్ = చక్కగానుండెను.

భావము:

జంటగా రెండు పక్కలా చేరి సుగ్రీవ విభీషణులు కూడి చామరాలు వీస్తున్నారు; హనుమంతుడు వెల్లగొడుగు పట్టుతున్నాడు; పావుకోళ్ళు భరతుడు భక్తితో తీసుకు వస్తున్నాడు; శత్రుఘ్నుడు విల్లంబులు తీసుకువస్తున్నాడు; లక్ష్మణుడు చనువుగా సేవచేస్తున్నాడు; కలశం పట్టుకుని జానకీదేవి కూడా వస్తోంది; బంగారపు కత్తిని అంగదుడు మోసుకొస్తున్నాడు; బంగారపు డాలును జాంబవంతుడు మోసుకొస్తున్నాడు. ఆ విధంగ దివ్యవైభవాలతో పుష్పకవిమానం అధిరోహించి గ్రహాలు సేవించే నిండు చంద్రుడిలా శ్రీరాముడు చక్కగా ఉన్నాడు