పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-311-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని విలపింప నంత విభీషణుండు రామచంద్రుని పంపుపడసి, రావణునకు దహనాది క్రియలు గావించె; నంత రాఘవేంద్రుండు నశోకవనంబున కేఁగి, శింశుపాతరు సమీపంబు నందు.

టీకా:

అని = అని; విలపింపన్ = శోకించుచుండగా; అంతన్ = అంతట; విభీషణుండు = విభీషణుడు; రామచంద్రుని = శ్రీరాముని; పంపున్ = అనుజ్ఞ; పడసి = పొంది; రావణున్ = రావణుని; కున్ = కి; దహనాదిక్రియలు = అంత్యక్రియలు; కావించెన్ = చేసెను; అంతన్ = అప్పుడు; రాఘవేంద్రుండున్ = శ్రీరాముడు {రాఘవేంద్రుండు - రఘువంశపు ప్రభువు, రాముడు}; అశోకవనంబున్ = అశోకవనమున; కున్ = కి; ఏగి = వెళ్ళి; శింశుపాతరు = ఇరుగుడుచెట్టు (అశోకచెట్టువద్ద అని అంటుంటారు); సమీపంబున్ = దగ్గర; అందున్ = లో.

భావము:

అని రావణాసురుని భార్య మండోదరి శోకిస్తోంది. అంతట విభీషణుడు శ్రీరాముని అనుజ్ఞ పొంది రావణునికి అంత్యక్రియలు చేసాడు. అప్పుడు శ్రీరాముడు అశోకవనానికి వెళ్ళి అశోకచెట్టు దగ్గరకి వెళ్ళి.....