పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-307-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వచ్చి తమతమ నాథులం గని, శోకించి; రందు మండోదరి రావణుం జూచి యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఇలా; వచ్చి = వచ్చి; తమతమ = వారివారి; నాథులన్ = భర్తలను; కని = చూసి; శోకించిరి = ఏడిచిరి; అందున్ = వారిలో; మండోదరి = మండోదరి; రావణున్ = రావణుని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా వచ్చిన ఆ రాక్షస కాంతలు వారివారి భర్తలను చూసి దుఃఖించారు, వారిలో మండోదరి రావణుని చూసి ఈ విధంగా పలికింది.