పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-306-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొప్పులు బిగి వీడి కుసుమమాలికలతో-
నంసభాగంబుల నావరింప
సేసముత్యంబులు చెదరఁ గర్ణిక లూడఁ-
గంఠహారంబులు గ్రందుకొనఁగ
దనపంకజములు వాడి వాతెఱ లెండఁ-
న్నీళ్ళవఱద లంములు దడుప
న్నపు నడుములు వ్వాడఁ బాలిండ్ల-
రువులు నడుములఁ బ్రబ్బికొనఁగ

9-306.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నెత్తి మోఁదికొనుచు నెఱిఁ బయ్యెదలు జాఱ
ట్టు నిట్టుఁ దప్పడుగు లిడుచు
సురసతులు వచ్చి ట భూతబేతాళ
దనమునకు ఘోరదనమునకు.

టీకా:

కొప్పులు = జుట్టుముడుల; బిగి = బిగింపు; వీడి = వదులైపోయి; కుసుమ = పూల; మాలికల = హారముల; తోన్ = తోటి; అంసభాగంబులన్ = మూపులపై; ఆవరింపన్ = పరచుకొనగా; సేస = పాపట; ముత్యంబులున్ = ముత్యాలు; చెదరన్ = చెదిరిపోగా; కర్ణికలు = కర్ణాభరణములు; ఊడన్ = ఊడిపోగా; కంఠ = మెడలోని; హారంబులు = హారములు; క్రందుకొనగన్ = చిక్కుపడిపోగా; వదన = మోములు అనెడి; పంకజములు = పద్మములు; వాడి = వాడిపోగా; వాతెఱలు = పెదవులు; ఎండన్ = ఎండిపోగా; కన్నీళ్ళ = కన్నీళ్ళు; వఱదలు = వరదలై; అంగములున్ = అవయవములు; తడుపన్ = తడిపేయగా; సన్నపు = సన్నటి; నడుములు = నడుములు; జవ్వాడ = జవజవమని ఆడగా; పాలిండ్ల = స్తనముల; బరువులు = బరువులు; నడుములన్ = నడుములపైన; ప్రబ్బికొనగన్ = కమ్ముకోగా.
నెత్తి = తల; మోదికొనుచు = బాదుకొంటూ; నెఱిన్ = చక్కగా కట్టిన; పయ్యదలు = పైటలు; జాఱన్ = జారికోగా; అట్టునిట్టు = చలించెడి; తప్పటడుగులు = తప్పటడుగులు; ఇడుచు = వేస్తూ; అసుర = రాక్షస; సతులు = స్త్రీలు; వచ్చిరి = వచ్చిరి; అటన్ = అక్కడకు; భూతబేతాళ = పిశాచవిశేషములు {భూతబేతాళములు - పిశాచవిశేషములు, భూతములు (శ్మశానవాసులు). బేతాళములు (భూతావిష్టమృత శరీరము)}; సదనమున్ = తిరుగుచున్నచోటి; కున్ = కి; ఘోర = భయంకరమైన; కదనమున్ = యుద్ధభూమి; కున్ = కి.

భావము:

భూతబేతాళాలు తిరుగుతున్న ఆ భీకర యుద్ధభూమికి తప్పటడుగులు వేస్తూ రాక్షస స్త్రీలు వచ్చారు. వారి జుట్టుముళ్ళు వదులైపోయాయి, పూలహారాల మూపులపై పరచుకొన్నాయి, పాపటముత్యాలు చెదిరిపోయాయి, కర్ణాభరణాలు ఊడిపోయాయి, మెడలో హారాలు చిక్కుపడిపోయాయి, మోములు వాడిపోయాయి, పెదవులు ఎండిపోయాయి, కన్నీళ్ళు వరదలు కట్టాయి, స్తనాల బరువుకు సన్నటి నడుములు జవజవలాడాయి, పైటలు జారిపోయాయి. వారు తలబాదుకొంటూ దుఃఖిస్తున్నారు.