పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-303-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లువింటన్ గుణటంకృతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగా
బ్రయోగ్రానలసన్నిభం బగు మహాబాణంబు సంధించి రా
లాముండగు రాముఁడేసె ఖరభాషాశ్రావణున్ దేవతా
విద్రావణు వైరిదారజనగర్భస్రావణున్ రావణున్.

టీకా:

బలు = బలమైన; వింటన్ = ధనుస్సునందు; గుణ = నారి; టంకృతమున్ = మీటినశబ్దములు, ధనుష్టంకారములు; నిగుడన్ = చెలరేగగా; బ్రహ్మాండ = అతిమిక్కిలి; భీమంబుగా = భీకరముగా; ప్రళయ = ప్రళయకాలపు; ఉగ్ర = భయంకరమైన; అనల = అగ్ని; సన్నిభంబు = వంటిది; అగు = అయిన; మహా = గొప్ప; బాణంబున్ = బాణమును; సంధించి = ఎక్కుపెట్టి; రాజ = రాజులలో; లలాముండు = శ్రేష్ఠుడు; అగు = ఐన; రాముడు = శ్రీరాముడు; ఏసెన్ = ప్రయోగించెను; ఖర = పరుషమైన; భాషా = మాటలను; శ్రావణున్ = వినిపించువానిని; దేవతా = దేవతల; బల = సైన్యమును; విద్రావణున్ = పారదోలువానిని; వైరి = శత్రురాజుల; దారజన = భార్యల; గర్భస్రావణున్ = గర్భస్రావకారణుని; రావణున్ = రావణుని.

భావము:

ఆ రాజలలాముడైన శ్రీరాముడు గొప్పదైన ధనుష్టంకారాలు చెలరేగగా, పరుషంగా మాట్లాడే వాడు, దేవతల సైన్యాన్ని పారదోలే వాడిని, శత్రురాజుల భార్యల గర్భస్రావకారణుడు అయిన రావణునిపైన ప్రళయాగ్నిసమ భీకర బాణాలు ప్రయోగించాడు.