పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-298-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుపతిపంపున మాతలి
గురుతరమగు దివ్యరథముఁ గొనివచ్చిన, నా
ణీవల్లభుఁ డెక్కెను
కరుఁ డుదయాద్రి నెక్కు కైవడి దోఁపన్.

టీకా:

సురపతి = ఇంద్రుడు; పంపునన్ = నియోగింపబడిన; మాతలి = మాతలి {మాతలి - ఇంద్రుని సారధి పేరు}; గురుతరము = బహుగొప్పది {గురు - గురుతరము - గురుతమము}; అగు = ఐన; దివ్య = భవ్యమైన; రథమున్ = రథమును; కొనివచ్చినన్ = తీసుకురాగా; ఆ = ఆ; ధరణీవల్లభుడు = శ్రీరాముడు; ఎక్కెను = అధిరోహించెను; ఖరకరుడు = సూర్యుడు {ఖరకరుడు - తీవ్రమైన కిరణములు కలవాడు, సూర్యుడు}; ఉదయాద్రిన్ = తూర్పుకొండను; ఎక్కు = ఎక్కుచున్న; కైవడిన్ = అట్లు; తోపగన్ = అనిపించగా.

భావము:

ఇంద్రుడు పంపగా ఇంద్రసారథి మాతలి బహు భవ్యమైన రథాన్ని తీసుకు వచ్చాడు. శ్రీరాముడు ఆ రథం ఎక్కాడు. అలా రాముడు ఎక్కుతుంటే, సూర్యుడు తూర్పుకొండ ఎక్కుతున్నట్లు అనిపించింది.