పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-296-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వా రందఱు మ్రగ్గిన
నిమిషపతివైరి పుష్పకారూఢుండై
నికి నడచి రామునితో
రౌద్రముతోడ నంపయ్యము చేసెన్.

టీకా:

తనవారు = తనవైపుముఖ్యులు; అందఱున్ = అంతమంది; మ్రగ్గినన్ = మరణించగా; అనిమిషపతివైరి = రావణుడు {అనిమిషపతివైరి - అనిమిషపతి (ఇంద్రుని) వైరి, రావణుడు}; పుష్పకా = పుష్పకవిమానమును; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; అని = యుద్ధమున; కిన్ = కి; నడచి = వెళ్ళి; రాముని = శ్రీరాముని; తోన్ = తోటి; ఘన = గొప్ప; రౌద్రము = పౌరుషము; తోడన్ = తోటి; అంప = బాణములతో; కయ్యమున్ = యుద్ధమును; చేసెన్ = చేసెను.

భావము:

తనవైపు ముఖ్య వీరులంతా మరణించగా, రావణుడు పుష్పకవిమానం ఎక్కి యుద్ధానికి వెళ్ళి శ్రీరామునితో గొప్ప పౌరుషంతో బాణయుద్ధం చేసాడు.