పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-294-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వున లక్ష్మణుఁ డాజి
స్థలిఁ గూల్చెన్ మేఘనాదుఁ టులాహ్లాదున్
భేదిజయవినోదున్
జనితసుపర్వసుభటభావవిషాదున్.

టీకా:

అలవునన్ = కష్టపడి; లక్ష్మణుడు = లక్ష్మణుడు; ఆజిస్థలిన్ = రణరంగమున; కూల్చెన్ = కూలగొట్టెను; మేఘనాధున్ = మేఘనాధుని; చటుల = భయంకరమైన; ఆహ్లాదున్ = నవ్వుకలవానిని; బలభేది = ఇంద్రుని; జయ = జయించుట; వినోదున్ = అవలీలగాచేయువానిని; బల = బలముండుటవలన; జనిత = కలిగిన; సుపర్వ = దేవతా; సుభట = సైనికుల; భావ = మనసులలో; విషాదున్ = దుఖముకలిగించువానిని.

భావము:

నవ్వుకూడా భయంకరంగా ఉండేవాడు, అవలీలగా ఇంద్రుడిని జయించే వాడిని, తన భుజబలంతో దేవతా సైనికుల మనసులు కలత పెట్టువాడు అయిన మేఘనాథుడిని రణరంగంలో లక్ష్మణుడు కష్టపడి కూలగొట్టాడు.