పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-293-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రామచంద్రవిభుఁడు ణమున ఖండించె
మేటికడిమి నీలమేఘవర్ణు
బాహుశక్తిపూర్ణుఁ టుసింహనాదసం
కుచిత దిగిభకర్ణుఁ గుంభకర్ణు.

టీకా:

రామచంద్రవిభుడు = శ్రీరాముడు; రణమునన్ = యుద్ధమునందు; ఖండించెన్ = సంహరించెను; మేటి = గొప్ప; కడిమిన్ = పరాక్రమముతో; నీల = నల్లని; మేఘ = మబ్బులవంటి; వర్ణున్ = రంగు కలవానిని; బాహు = భుజ; శక్తి = బలము; పూర్ణున్ = నిండుగా ఉన్న వానిని; పటు = గట్టి; సింహనాద = బొబ్బతో; సంకుచిత = దిమ్మెరపోయిన; దిగిభ = దిగ్గజముల; కర్ణున్ = చెవులు కలవానిని; కుంభకర్ణు = కుంభకర్ణుని.

భావము:

కుంభకర్ణుడు నల్లరంగు రాక్షసుడు, మహా పరాక్రమశాలి. అతను గట్టిగా బొబ్బ పెడితే దిగ్గజాల చెవులు దిమ్మెరపోతాయి. అంతటి కుంభకర్ణుడిని శ్రీరాముడు యుద్ధంలో సంహరించాడు.