పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-292-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యెడ లక్ష్మణుఁ డుజ్జ్వల
సాకములఁ ద్రుంచె శైలమకాయు సురా
జేయు ననర్గళమాయో
పాయు న్నయగుణ విధేయు య్యతికాయున్.

టీకా:

ఆ = ఆ; ఎడన్ = సమయమునందు; లక్ష్మణుడు = లక్ష్మణుడు; ఉజ్జ్వల = ప్రకాశవంతమైన; సాయకములన్ = బాణములతో; త్రుంచెన్ = సంహరించెను; శైల = పర్వతము; సమ = లాంటి; కాయున్ = దేహము కలవానిని; సుర = దేవతలకే; అజేయున్ = జయింపరానివానిని; అనర్గళ = అడ్డులేని; మాయా = మాయలతోకూడిన; ఉపాయున్ = ఉపాయములు కలవానిని; అనయగుణ = చెడ్డవారి ఎడ; విధేయున్ = విధేయత కలవాడు; ఆ = ఆ; అతికాయున్ = అతికాయుని.

భావము:

ఆ సమయంలో పర్వతసమ దేహుడు, దేవతలకు సైతం అజేయుడు, మాయోపాయుడు, చెడ్డూడవారి సేవకుడు అయిన అతికాయుడిని లక్ష్మణుడు ఉజ్జ్వలమైన బాణాలతో సంహరించాడు.