పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-290-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాకారములు ద్రవ్వి రిఖలు పూడిచి-
కోటకొమ్మలు నేలఁ గూలఁ ద్రోచి
ప్రంబు లగలించి వాకిళ్ళు పెకలించి-
లుపులు విఱిచి యంత్రములు నెఱిచి
నవిటంకంబులు ఖండించి పడవైచి-
గోపురంబులు నేలఁ గూలఁ దన్ని
కరతోరణములు హిఁ గూల్చి కేతనం-
బులు చించి సోపానములు గదల్చి

9-290.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గృహము లెల్ల వ్రచ్చి గృహరాజముల గ్రొచ్చి
ర్మకుంభచయము పాఱవైచి
రులు కొలను చొచ్చి లఁచిన కైవడిఁ
పులు లంకఁ జొచ్చి లఁచి రపుఁడు.

టీకా:

ప్రాకారములు = ప్రహారీగోడలు; త్రవ్వి = తవ్వి; పరిఖలు = అగడ్తలను; పూడిచి = పూడ్చివేసి; కోటకొమ్మలున్ = బురుజులను; నేలన్ = నేలమీదకి; కూలద్రోచి = కూలగొట్టి; వప్రంబులన్ = కోటలను; అగలించి = పగులగొట్టి; వాకిళ్ళు = గుమ్మములను; పెకలించి = పీకి; తలుపులున్ = తలుపులను; విఱిచి = విరగ్గొట్టి; యంత్రములున్ = యంత్రములను; ఎఱిచి = చెరిచి; ఘన = గొప్ప; విటంకంబులున్ = గువ్వగూళ్ళను; ఖండించి = ఖండించి; పడవైచి = పడగొట్టి; గోపురంబులు = గోపురములను; నేలన్ = నేలమీదకి; కూలదన్ని = కూలగొట్టి; మకరతోరణములున్ = మకరతోరణములు; మహిన్ = నేలపై; కూల్చి = పడవేసి; కేతనంబులున్ = జండాలను; చించి = చింపి; సోపానములున్ = మెట్లు; కదల్చి = కదిలించి.
గృహములు = ఇళ్ళు; ఎల్లన్ = అన్నిటిని; వ్రచ్చి = బద్దలుకొట్టి; గృహరాజములన్ = భవనములను; గ్రొచ్చి = కూలగొట్టి; భర్మ = బంగారు; కుంభచయమున్ = కలశములన్నిటిని; పాఱవైచి = విసురివేసి; కరులు = ఏనుగులు; కొలను = మడుగులను; చొచ్చి = ప్రవేశించి; కలచిన = కలచివేసిన; కైవడిన్ = వలె; కపులు = కోతులు; లంకన్ = లంకను; చొచ్చి = ప్రవేశించి; కలచిరి = కలచివేసిరి; అపుడు = అప్పుడు.

భావము:

మడుగులో ప్రవేశించిన ఏనుగులు కలచివేసినట్లు, వానర సేన లంక ప్రవేశించి అలా కలచివేసింది. ప్రహారీగోడలు తవ్వి, అగడ్తలు పూడ్చివేసి, బురుజులు నేల కూలగొట్టి, కోటలు పగులగొట్టి, గుమ్మాలు పీకి, తలుపులు విరగ్గొట్టి, యంత్రాలు చెరిచి, గువ్వగూళ్ళు పడగొట్టి, గోపురాలు కూలగొట్టి, మకరతోరణాలు నేలగూల్చి, జండాలను చింపి, మెట్లు కదిలించి, ఇళ్ళు బద్దలుకొట్టి, భవనాలు కూలగొట్టి, బంగారు కలశాలు విసిరేసి లంకను అల్లకల్లోలం చేసింది. అప్పుడు...