పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-282-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విపన్నుండగు సముద్రుండు నదులతోఁ గూడి మూర్తి మంతుండయి చనుదెంచి రామచంద్రుని చరణంబులు శరణంబు జొచ్చి యిట్లని స్తుతియించె.

టీకా:

ఇట్లు = ఇలా; విపన్నుండు = ఆపదపాలైనవాడు; అగు = ఐన; సముద్రుండు = సముద్రుడు; నదులు = నదులు; తోన్ = తోటి; కూడి = కలిసి; మూర్తిమంతుడు = రూపుధరించినవాడు; అయి = అయ్యి; చనుదెంచి = వచ్చి; రామచంద్రుని = శ్రీరాముని; చరణంబులున్ = పాదములను; శరణంబుజొచ్చి = శరణువేడి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించె = స్తోత్రముచేసెను.

భావము:

ఇలా ఆపదపాలైన సముద్రుడు నదులతో కలిసి రూపు ధరించి వచ్చి శ్రీరాముని పాదాలను శరణువేడాడు. ఇంకా ఈ విధంగా స్తోత్రం చేసాడు.