పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-278-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు లంకాదహనంబు చేసివచ్చి వాయుజుండు సీతకథనంబు చెప్పిన విని రామచంద్రుండు వనచరనాథ యూధంబులుం దానును చనిచని.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; లంకాదహనంబున్ = లంకనుకాల్చుట; చేసి = చేసి; వచ్చి = వెనుకకువచ్చి; వాయుజుండు = హనుమంతుడు {వాయుజుండు - వాయుపుత్రుడు, హనుమంతుడు}; సీత = సీత; కథనంబున్ = వృత్తాంతమును; చెప్పినన్ = చెప్పగా; విని = విని; రామచంద్రుడు = రామచంద్రుడు; వనచర = వానరముల {వనచరము - అడవిలోతిరుగునది, కోతి}; నాథ = నాయకుల; యూథంబులున్ = సైన్యములు; తానున్ = అతను; చనిచని = బయలుదేరివెళ్ళి.

భావము:

ఈ విధంగా లంకను కాల్చి, వెనుకకు వచ్చి హనుమంతుడు సీత వృత్తాంతం చెప్పగా విని, రామచంద్రుడు వానర సైన్యాలతో రావణాసురుడి మీదకు దాడికి బయలుదేరాడు.