పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-276-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సముద్రంబు దాఁటి సీతం గని, హనుమంతుండు దిరిగి చనుదెంచుచు నక్షకుమారాదుల వధియించి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సముద్రంబున్ = సముద్రమును; దాటి = దాటి; సీతన్ = సీతను; కని = కనుగొని; హనుమంతుండు = హనుమంతుడు; తిరిగి = వెనుకకు; చనుదెంచుచున్ = వచ్చుచు; అక్షకమార = అక్షకుమారుడు; ఆదులన్ = మున్నుగువారిని; వధియించి = సంహరించి.

భావము:

ఈ విధంగ సముద్రాన్ని దాటి సీతను కనుగొని హనుమంతుడు వెనుకకు వస్తూ అక్షకుమారుడు మున్నగు రాక్షసులను సంహరించాడు.