పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-275-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాటు కలిమి మారుతి
లితామిత లాఘవమున లంఘించెను శై
లినీగణసంబంధిన్
పూరిత ధరణి గగన సంధిం గంధిన్.

టీకా:

అలవాటు = అభ్యాసము {అలవాటుకలిమి - హనుమంతుడు బాలునిగా సూర్యుని వరకు గెంతి మింగబోయినది సూచింప పడుతున్నది}; కలిమిన్ = ఉండుటచేత; మారుతి = హనుమంతుడు {మారుతి - వాయుపుత్రుడు, హనుమంతుడు}; లలిత = సున్నితమైన; అమిత = అత్యధికమైన; లాఘవమునన్ = నేర్పుతో; లంఘించెను = దాటెను; శైవలినీ = నదుల {శైవలిని - నాచుగలది, నది}; గణ = సమూహమునకు; సంబంధిన్ = బంధువైనదానిని; జల = నీటితో; పూరిత = నిండియుండి; ధరణి = భూమిని; గగన = ఆకాశమును; సంధిన్ = కలుపుదానిని; కంధిన్ = సముద్రమును {కంధి - కం (నీటికి) నిధి, కడలి}.

భావము:

బాలునిగా సూర్యుని వరకు గెంతి మింగబోయిన అలవాటు ఉండడంతో మారుతి నదులు అన్నింటికీ బంధువు, భూమికి ఆకాశానికి వ్యవధానం, నీటితో నిండి ఉండేది అయిన సముద్రాన్ని మిక్కిలి లాఘవంగా దాటాడు.