పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-273-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లీలన్ రామవిభుం డొక
కోలం గూలంగ నేసె గురు నయశాలిన్
శీలిన్ సేవితశూలిన్
మాలిన్ వాలిన్ దశాస్యమానోన్మూలిన్.

టీకా:

లీలన్ = క్రీడగా; రామవిభుండు = శ్రీరామప్రభువు; ఒక = ఒకే ఒక; కోలన్ = బాణముతో; కూలంగన్ = పడిపోవునట్లు; ఏసెన్ = కొట్టెను; గురు = గొప్ప; నయశాలిన్ = నీతిమంతుని; శీలిన్ = మంచిశీలముకలవానిని; సేవిత = పూజింపడిన; శూలిన్ = పరమశివుడు కలవానిని; మాలిన్ = మాలధరించినవానిని {మాలిన్ - ఇంద్రుడొసగిన మాల కంఠమున ధరించినవాడు, వాలి}; వాలిన్ = వాలిని; దశాస్య = రావణుని; మాన = గర్వమును; ఉన్మూలిన్ = హరించినవానిని.

భావము:

గొప్ప నీతిశాలి, పరమశివ భక్తుడు, ఇంద్రుడు ఇచ్చిన మాల ధరించిన వాడిని, రావణుని గర్వాన్ని హరించినవాడు ఐన వాలిని, శ్రీరాముడు ఒకే ఒక బాణంతో కూల్చివేశాడు.