పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-272-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నిగ్రహము నీకు వల దిఁక
గ్రజు వాలిన్ వధింతు" ని నియమముతో
గ్రేసరుఁగా నేలెను
సుగ్రీవుం జరణఘాతచూర్ణగ్రావున్.

టీకా:

నిగ్రహము = బెదురు, చెర; నీ = నీ; కున్ = కు; వలదు = వద్దు; ఇకన్ = ఇకపైన; అగ్రజున్ = అన్నను; వాలిన్ = వాలిని; వధింతును = సంహరించెదను; అని = అని; నియమము = ప్రతిజ్ఞ; తోన్ = తోటి; అగ్రేసరుగాన్ = ప్రభువుగా; ఏలెను = పాలించెను; సుగ్రీవున్ = సుగ్రీవుని; చరణ = కాలి; ఘాత = దెబ్బతో; చూర్ణ = పిండిచేయబడిన; గ్రావున్ = బండరాళ్ళు కలవానిని.

భావము:

ఒక్క తన్నుతోనే బండరాళ్ళను పిండిపిండి చేయగల మహ బలశాలి సుగ్రీవుడికి, “ఇకపైన నీకు ఈ నిర్భందం అక్కరలేదు, మీ అన్న వాలిని సంహరిస్తాను” అని అభయం ఇచ్చి, శ్రీరామచంద్ర ప్రభువు పాలించాడు.