పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-271-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతనా రామచంద్రుండు లక్ష్మణసహితుండై, సీత వెదక నరుదెంచి, నిజకార్యనిహతుండైన జటాయువునకుఁ పరలోకక్రియలు గావించి, ఋశ్యమూకంబునకుం జని.

టీకా:

అంతన్ = అప్పుడు; ఆ = ఆ; రామచంద్రుండు = రామచంద్రుడు; లక్ష్మణ = లక్ష్మణునితో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; సీతన్ = సీతను; వెదకన్ = అన్వెషించుటకై; అరుదెంచి = వచ్చి; నిజ = తన; కార్య = పనియందు; నిహతుండు = మరణించినవాడు; ఐన = అయిన; జటాయువున్ = జటాయువున; కున్ = కు; పరలోకక్రియలు = అంత్యక్రియలు; కావించి = చేసి; ఋశ్యమూకంబునన్ = ఋశ్యమూకపర్వతమున; కున్ = కు; చని = వెళ్ళి.

భావము:

అప్పుడు, సీతాన్వెషణకై వచ్చిన రామలక్ష్మణులు, రామకార్యంలో ప్రాణాలు త్యజించిన ఆ జటాయువునకు, అంత్యక్రియలు చేసి, ఋశ్యమూకపర్వతానికి వెళ్ళారు.