పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-270-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సురేశ్వరుండు వడి నంబరవీథి నిలాతనూజ న
న్యాము చేసి నిష్కరుణుఁడై కొనిపోవఁగ నడ్డమైన ఘో
రాతహేతిఁ ద్రుంచె నసహాయత రామనరేంద్రకార్యద
త్తాయువుఁ బక్షవేగపరిహాసితవాయువు నజ్జటాయువున్.

టీకా:

ఆ = ఆ; అసురేశ్వరుండు = రాక్షసరాజు; వడిన్ = వేగముగా; అంబర = ఆకాశ; వీథిన్ = మార్గమున; ఇలాతనూజన్ = సీతను {ఇలాతనూజ - భూమియందు జనించినామె, సీత}; అన్యాయము = మోసము; చేసి = చేసి; నిష్కరుణుడు = దయమాలినవాడు; ఐ = అయ్యి; కొనిపోవన్ = తీసుకుపోతుండగ; అడ్డమైన = అడ్డమురాగా; ఘోర = భయంకరమైన; ఆయత = పెద్ద; హేతిన్ = ఆయుధముతో; త్రుంచెన్ = సంహరించెను; అసహాయత = నిస్సహాయురాలిని; రామ = రాముడు అనెడి; నరేంద్ర = రాజుయొక్క; కార్య = పనియందు; దత్త = ఇచ్చివేసిన; ఆయువున్ = ఆయుష్షుకలదానిని; పక్ష = రెక్కల; వేగ = వేగముచేత; పరిహాసిత = మించిన; వాయువున్ = వాయువుకలదానిని; జటాయువున్ = జటాయువును.

భావము:

దయావిహీనుడైన రాక్షసరాజు అలా మోసం చేసి వేగంగా ఆకాశ మార్గాన సీతను తీసుకుపోతుంటే, రామకార్యం కోసం ఆయుస్సు త్యాగంచేసినది, వాయువేగాన్ని మించిన వేగం గలది అయిన జటాయువు అడ్డగించింది. నిస్సహాయురాలైన ఆ జటాయువును భయంకరమైన పెద్ద ఆయుధంతో రావణుడు సంహరించాడు.