పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-269-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వనంబున రాముఁ నుజ సమేతుడై-
తితోడ నొక పర్ణశాల నుండ
రావణు చెల్లలు తిఁ గోరి వచ్చిన-
మొగి లక్ష్మణుఁడు దాని ముక్కు గోయ
ది విని ఖరదూషణాదులు పదునాల్గు-
వేలు వచ్చిన రామవిభుఁడు గలన
బాణానలంబున స్మంబు గావింప-
నకనందన మేని క్కఁదనము

9-269.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విని దశగ్రీవుఁ డంగజ వివశుఁ డగుచు
ర్థిఁ బంచినఁ బసిఁడిఱ్ఱి యై నటించు
నీచు మారీచు రాముఁడు నెఱి వధించె
నంతలో సీతఁ గొనిపోయె సురవిభుఁడు.

టీకా:

ఆ = ఆ; వనంబునన్ = అడవియందు; రాముడు = శ్రీరాముడు; అనుజ = తమ్మునితో; సమేతుడు = కలిసి ఉన్నవాడు; ఐ = అయ్యి; సతి = భార్య; తోడన్ = తోటి; ఒక = ఒకానొక; పర్ణశాలన్ = పర్ణశాలయందు; ఉండన్ = ఉండగా; రావణు = రావణాసురుని; చెల్లెలు = చెల్లెలు; రతిన్ = మన్మథక్రీడను; కోరి = కావాలని; వచ్చినన్ = రాగా; మొగి = పూని; లక్ష్మణుడు = లక్ష్మణుడు; దాని = దానియొక్క; ముక్కున్ = నాసికను; కోయన్ = కోసివేయగా; అది = దానిని; విని = విని; ఖర = ఖరుడు; దూషణ = దూషణుడు; ఆదులు = మున్నగువారు; పదునాల్గువేలు = పద్నాలుగువేలమంది; వచ్చినన్ = రాగా; రామవిభుడు = శ్రీరామప్రభువు; కలనన్ = యుద్ధభూమియందు; బాణ = బాణములుఅనెడి; అనలంబునన్ = అగ్నిలో; భస్మంబున్ = బూడిద; కావింపన్ = చేయగా; జనకనందన = సీత {జనకనందన - జనకుని పుత్రిక, సీత}; మేని = శరీర; చక్కదనమున్ = లావణ్యమును.
విని = విని; దశగ్రీవుడు = రావణుడు {దశగ్రీవుడు - దశ(పది) గ్రీవుడు (కంఠములుగలవాడు), రావణుడు}; అంగజ = మన్మథునివలన {అంగజుడు - అంగ (దేహము)న పుట్టువాడు, మన్మథుడు}; వివశుడు = వశముతప్పినవాడు; అగుచున్ = ఐపోతూ; అర్థిన్ = కోరి; పంచినన్ = పంపించగా; పసిడి = బంగారు; ఇఱ్ఱి = లేడి; ఐ = అయ్యి; నటించు = నటిస్తున్నట్టి; నీచున్ = నీచుని; మారీచున్ = మారీచుని; రాముడు = రాముడు; నెఱిన్ = పరాక్రమముతో; వధించెన్ = సంహరించెను; అంతలోన్ = ఆలోపల; సీతన్ = సీతను; కొనిపోయెను = తీసుకుపోయెను; అసురవిభుడు = రాక్షసరాజు.

భావము:

శ్రీరాముడు తమ్ముడితో భార్యతో కలిసి దండకారణ్యంలో ఒక పర్ణశాలలో ఉన్నాడు. అప్పుడు రావణాసురుని చెల్లెలు శూర్పణఖ కామించి వచ్చింది. అంతట లక్ష్మణుడు ఆమె ముక్కు కోసెను. అది విని ఖరుడు దూషణుడు అనే రాక్షసులు పద్నాలుగువేల మంది రాక్షససేనతో దండెత్తి వచ్చారు. శ్రీరామచంద్రుడు యుద్ధంచేసి తన బాణాగ్నిలో వారిని భస్మం చేసాడు. సీత చక్కదనం విని మన్మథ పరవశుడైన రావణుడు మారీచుడిని పంపాడు. ఆ నీచుడు బంగారు లేడి రూపంలో రాగా, శ్రీరాముడు వాడిని వధించెను. ఆ సమయంలో రావణాసురుడు సీతను తీసుకుపోయెను.