పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-268-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుణ్యుఁడు రామచంద్రుఁ డట పోయి ముదంబునఁ గాంచె దండకా
ణ్యముఁ దాపసోత్తమ శణ్యము నుద్దత బర్హి బర్హ లా
ణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటనప్రభూత సా
ద్గుణ్యము నుల్లసత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.

టీకా:

పుణ్యుడు = పుణ్యాత్ముడు; రామచంద్రుడు = రాముడనెడి చల్లనివాడు; అట = అక్కడ; పోయి = వెళ్ళి; ముదంబునన్ = సంతోషముతో; కాంచెన్ = దర్శించెను; దండకారణ్యమున్ = దండకారణ్యమును; తాపస = ఋషులలో; ఉత్తమ = శ్రేష్ఠులకు; శరణ్యమున్ = అండనిచ్చెడిది; ఉద్ధతన్ = గర్వించిన; బర్హి = ఆడనెమలి; బర్హ = మగనెమలుతో; లావణ్యమును = మనోజ్ఞమైనది; గొతమీ = గోదావరీ; విమల = స్వచ్ఛమైన; వాఃకణ = నీటిబిందుల; పర్యటన = వ్యాప్తులచేత; ప్రభూత = అతిశయించి; సాద్గుణ్యమున్ = సద్గుణసంపత్తిగలది; ఉల్లసత్ = ప్రకాశించుచున్న; తరు = చెట్లు; నికుంజ = పొదలచే; వరేణ్యమున్ = ఉత్తమమైనదానిని; అగ్రగణ్యమున్ = గొప్పగ ఎంచదగినదానిని.

భావము:

పుణ్యాత్ముడైన శ్రీరామచంద్రుడు అలా వెళ్ళి ఋషీశ్వరుల సమాశ్రయము, పురివిప్పి ఆడే నెమళ్ళతో మనోజ్ఞమైనది, పవిత్ర గోదావరీ జలాలతో విలసిల్లేది, గొప్ప చెట్లు పొదలుతో కూడినది ఐన విశిష్టమైన దండకారణ్యాన్ని సంతోషముతో దర్శించాడు.