పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-267-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తున్ నిజపదసేవా
నితున్ రాజ్యమున నునిచి నృపమణి యెక్కెన్
సురుచిర రుచి పరిభావిత
గురుగోత్రాచలముఁ జిత్రకూటాచలమున్.

టీకా:

భరతున్ = భరతుడిని; నిజపాద = తనపాదములను; సేవా = సేవించుటయందు; నిరతున్ = భక్తిగలవానిని; రాజ్యమునన్ = రాజ్యమునందు; ఉనిచి = నియమించి; నృప = రాజులలో; మణి = ఉత్తముడు; ఎక్కెన్ = అధిరోహించెను; సురుచిర = మంచి రమణీయమైన; రుచి = కాంతులతో; పరిభావిత = ధిక్కరించిన; గురు = గొప్ప; గోత్రాచలమున్ = కులపర్వతములుగల; చిత్రకూటమున్ = చిత్రకూటపర్వతమును.

భావము:

తన పాదాసేవానురక్తుడైన భరతుడిని రాజ్య పాలన యందు నియమించాడు. పిమ్మట, కులపర్వతాలను మించిన రమణీయమైన కాంతులు గల చిత్రకూటపర్వతాన్ని రాజశేఖరుడు శ్రీరాముడు ఎక్కాడు.