పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-266-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుఁడు పనిచిన మేలని
కజయును లక్ష్మణుండు సంసేవింపన్
పతి రాముఁడు విడిచెను
పాలారాధ్య ద్విషదసాధ్య నయోధ్యన్.

టీకా:

జనకుడు = తండ్రి; పనిచిన = పంపించగా; మేలు = మంచిది; అని = అని; జనకజయును = సీతాదేవి {జనకజ - జనకునికి పుట్టినామె, సీత}; లక్ష్మణుండు = లక్ష్మణుడు; సంసేవింపన్ = చక్కగాసేవిస్తుండగా; జనపతి = రాజైన; రాముడు = రాముడు; విడిచెన్ = వదిలిపెట్టెను; జనపాల = రాజులచే; ఆరాధ్య = పూజింపబడెడిది; ద్విషద్ = శత్రువులకు; అసాధ్యన్ = సాధింపరానిది ఐన; అయోధ్యన్ = అయోధ్యను.

భావము:

అయోధ్య రాజులచే పూజినీయమైనది. శత్రువులకు సాధింపరానిది. అట్టి అయోధ్యను తండ్రి ఆఙ్ఞను శిరసావహించి సీతాదేవి, లక్ష్మణుడు తనను సేవిస్తుండగా శ్రీరాముడు వదిలి పెట్టెను.