పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-265-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రథుఁడు మున్ను గైకకు
శుఁడై తానిచ్చి నట్టి రము కతన వా
గ్ద చెడక యడివి కనిచెను
ముఖముఖకమలతుహినధామున్ రామున్.

టీకా:

దశరథుడు = దశరథుడు; మున్నున్ = ఇంతకుముందు; కైక = కైక; కున్ = కు; వశుడు = అనుకూలుడు; ఐ = అయ్యి; తాన్ = అతను; ఇచ్చిన = ఇచ్చిన; అట్టి = అటువంటి; వరమున్ = వరముల; కతనన్ = వలన; వాగ్దశన్ = వాగ్దత్తమును; చెడక = తప్పక; అడవి = అరణ్యమున; కిన్ = కు; అనిచెను = పంపించెను; దశముఖ = రావణుని {దశముఖుడు - పదిముఖములు కలవాడు, రావణుడు}; ముఖ = ముఖము అనెడి; కమల = కమలములకు; తుహినధామున్ = చంద్రునివంటివానిని {తుహినధాముడు - తుహిన (మంచువంటి చల్లదనమునకు) ధాముడు (నివాసమైనవాడు), చంద్రుడు}; రామున్ = రాముడిని.

భావము:

దశరథుడు ఇంతకు ముందు తాను కైకకు ఇచ్చిన వరాలకు కట్టుబడి రావణుని ముఖ కమలాలకు చంద్రునివంటి వాడైన శ్రీరాముడిని అడవికి పంపించాడు.