పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-261-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గారామునఁ గౌశిక మఖ
మా రాముఁడు గాచి దైత్యు ధికు సుబాహున్
ఘోరాజిఁ ద్రుంచి తోలెన్
మారీచున్ నీచుఁ గపటమంజులరోచున్.

టీకా:

గారామునన్ = గౌప్పగా; కౌశిక = కౌశికుని; మఖమున్ = యాగమును; ఆ = ఆ; రాముడు = శ్రీరాముడు; కాచి = కాపాడి; దైత్యున్ = రాక్షసుని; అధికున్ = గొప్పవానిని; సుబాహున్ = సుబాహుని; ఘోర = భయంకరమైన; ఆజిన్ = యుద్ధమునందు; త్రుంచి = చంపి; తోలెన్ = తరిమికొట్టి; మారీచున్ = మారీచుని; నీచున్ = దుర్మార్గుని; కపట = మోసపూరిత; మంజుల = మనోజ్ఞమైన (బంగారులేడి); రోచున్ = రూపముధరించినవానిని.

భావము:

శ్రీరాముడు భీకర యుద్ధంచేసి రాక్షసుడైన సుబాహుని చంపాడు. కపటవేషం వేసిన దుర్మార్గుడు మారీచుని తరిమికొట్టాడు. కౌశికుడు అను మరొక పేరు గల విశ్వామిత్రుని యాగాన్ని కాపాడాడు.