పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరాముని కథనంబు

  •  
  •  
  •  

9-259-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రేంద్రాశకుఁ బూర్ణచంద్రుఁ డుదితుండై నట్లు నారాయణాం
మునం బుట్టె మదాంధ రావణశిరస్సంఘాతసంఛేదన
క్రణోద్దాముఁడు రాముఁ డా గరితకుం గౌసల్యకున్ సన్నుతా
నైర్మల్య కతుల్య కంచితజనుస్సంసారసాఫల్యకున్.

టీకా:

అమరేంద్రాశ = తూర్పుదిక్కున {అమరేంద్రాశ - అమరేంద్రుని (ఇంద్రుని) ఆశ (దిక్కు), తూర్పు}; కున్ = కు; పూర్ణచంద్రుడు = నిండుచంద్రుడు; ఉదితము = ఉదయించినవాడు; ఐన = అయిన; అట్లు = విధముగ; నారాయణ = విష్ణుమూర్తి; అంశమునన్ = అంశతో; పుట్టె = జన్మించెను; మద = గర్వము అనెడి; అంధ = గుడ్డితనము కల; రావణ = రావణుని; శిరస్ = తలలు; సంఘాత = సమూహమునను; ఛేదన = ఖండించెడి; క్రమణ = విధమునందు; ఉద్దాముడు = ఆరితేరినవాడు; రాముడు = శ్రీరాముడు; గరిత = పతివ్రత; కున్ = కు; కౌసల్య = కౌసల్యాదేవి; కున్ = కి; సన్నుత = స్తుతింపబడెడి; అసమ = సాటిలేని; నైర్మల్య = పరిశుద్ధురాలు; కిన్ = కు; అంచిత = పూజనీయమైన; కౌసల్యాదేవి సాటిలేని పూజనీయ పుట్టుక సంసారసాఫల్యత పొందిన మిక్కిలి పరిశుద్దురాలైన సాధ్వి. తూర్పుదిక్కున నిండుచంద్రుడు ఉదయించినట్లు, ఆమె యందు విష్ణుమూర్తి తన అంశతో గర్వాంధుడైన రావణుని తలలు నరకుటలో ఆరితేరిన శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు.

భావము:

కౌసల్యాదేవి సాటిలేని పూజనీయ పుట్టుక సంసారసాఫల్యత పొందిన మిక్కిలి పరిశుద్దురాలైన సాధ్వి. తూర్పుదిక్కున నిండుచంద్రుడు ఉదయించినట్లు, ఆమె యందు విష్ణుమూర్తి తన అంశతో గర్వాంధుడైన రావణుని తలలు నరకుటలో ఆరితేరిన శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు.