పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : ఖట్వాంగుని చరిత్రము

  •  
  •  
  •  

9-257-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సెన్ సంగములెల్లఁ బాసి నియతిన్ ట్వాంగు డశ్రాంతమై
దయ్యున్ మఱిమీఁద లే దనెడిదై ల్యాణమై యాత్మలోఁ
లఁపం బల్కగరానిదై పరమమై త్త్వజ్ఞు లూహించి హృ
జ్జజాతంబుల వాసుదేవుఁ డని సంస్ఠాపించు నా బ్రహ్మమున్.

టీకా:

కలసెన్ = లీనమైపోయెను; సంగముల్ = తగులములు; ఎల్లన్ = సమస్తమును; పాసి = వదలివేసి; నియతిన్ = నిష్ఠతో; ఖట్వాంగుడు = ఖట్వాంగుడు {ఖట్వాంగుడు – సూర్యవంశ మహారాజు, శ్రీరాముని తాత అజుడు ఆయన తాత రఘువు ఆయన తాత ఈ ఖట్వాంగుడు}; అశ్రాంతము = నిరంతరమైనది; ఐ = అయ్యి; కలది = ఉన్నది; అయ్యున్ = అయిప్పటికిని; మఱి = ఇక; మీదన్ = మించినది; లేదు = లేదు; అనెడిది = అనెడిది; ఐ = అయ్యి; కల్యాణను = శుభకరము; ఐ = అయ్యి; ఆత్మ = మనసుల; లోన్ = అందు; తలపన్ = ఊహించుటకు; పల్కన్ = చెప్పుటకు; రానిది = శక్యముకానిది; ఐ = అయ్యి; పరమము = అత్యున్నతము; ఐ = అయ్యి; తత్త్వజ్ఞులు = పరమజ్ఞానులు; ఊహించి = తరచితరచి; హృత్ = హృదయములు అనెడి; జలజాతంబులన్ = పద్మములందు; వాసుదేవుడు = వాసుదేవుడు {వాసుదేవుడు - హృత్పద్మముల వసించువాడు, విష్ణువు}; అని = అని; సంస్థాపించున్ = నిలుపుకొనెడిదియైన; ఆ = ఆ; బ్రహ్మమున్ = పరబ్రహ్మను.

భావము:

ఆ ఖట్వాంగుడు లౌకికబంధాలు అన్నీ తెంచేసుకుని, నిష్ఠతో శాశ్వతమైనది, తనకు మించినది లేనిది, మిక్కిలి శుభకరమైనది, మనసు ఊహకు అందనిది, చెప్పుటకు సాధ్యం కానిది, సర్వోన్నతమైనది, తత్త్వజ్ఞానులు తమ హృదయపద్మాల యందు వాసుదేవుడని సంస్థాపించుకొనునది అయిన ఆ పరబ్రహ్మంలో లీనం అయిపోయాడు.