పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : ఖట్వాంగుని చరిత్రము

  •  
  •  
  •  

9-254-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మరులు వేఁడిన సురనాథులఁ జంపి-
త్రిశులతోఁ దన బ్రతుకుకాల
మెంతని యడిగిన నిదె నిండుచున్నది-
డవులే దేమైన డుగు మనిన
రములు గోరక రవిమానం బెక్కి-
నపురికేతెంచి త్త్వబుద్ధిఁ
రమేశ్వరుని యంద భావంబుఁ గీలించి-
  "కులదైవతద్విజకులముకంటె

9-254.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నంగనా ప్రాణ రాజ్య పుత్రాదు లెల్ల
గావు ప్రియములు ధర్మంబు డచి నాదు
తి ప్రవర్తింప దెన్నఁడు ది నెఱుంగ
న్య మా యీశ్వరునిఁ దక్క నుచు మఱియు.

టీకా:

అమరులు = దేవతలు; వేడినన్ = కోరగా; అసుర = రాక్షస; నాథులన్ = రాజులను; చంపి = సంహరించి; త్రిదశుల = దేవతల; తోన్ = తోటి; తన = తనయొక్క; బ్రతుకుకాలము = జీవితకాలమును; ఎంత = ఇంకఎంత ఉన్నది; అని = అని; అడిగినన్ = అడుగగా; ఇదె = ఇదిగో; నిండుచున్నది = పూర్తయిపోతున్నది; తడవు = ఆలస్యము; లేదు = లేదు; ఏమైమయినన్ = ఇంకొకటేదైన; అడుగుము = కోరుము; అనినన్ = అనగా; వరములు = వరములు; కోరక = అడుగక; వర = శ్రేష్ఠమైన; విమానంబున్ = విమానమును; ఎక్కి = అధిరోహించి; తన = తనయొక్క; పురి = పట్టణమున; కిన్ = కు; ఏతెంచి = వచ్చి; తత్త్వబుద్ధిన్ = తత్వజ్ఞానముతో; పరమేశ్వరుని = భగవంతుని; అంద = ఎడలనే; భావంబున్ = మనసును; కీలించి = లగ్నముచేసి; కులదైవత = కులదేవతలైన; ద్విజ = బ్రాహ్మణ; కులము = కులపువారి; కంటెన్ = కంటె; అంగనా = భార్య.
ప్రాణ = ప్రాణములు; రాజ్య = రాజ్యాధికారము; పుత్ర = కొడుకులు; ఆదులున్ = మున్నగునవి; ఎల్ల = సమస్తమును; కావు = కావు; ప్రియములు = ఇష్టపడవలసినవి; ధర్మంబున్ = ధర్మబద్ధమును; కడచి = దాటి; నాదు = నాయొక్క; మతి = బుద్ధి; ప్రవర్తింపదు = నడవదు; ఎన్నడున్ = ఎప్పుడుకూడ; మదిన్ = మనసున; ఎఱుంగ = తెలియను; అన్యమున్ = ఇతరవిషయములు; ఆ = ఆ; ఈశ్వరుని = విష్ణుమూర్తిని; తక్కన్ = తప్పించి; అనుచున్ = అనుకొనుచు; మఱియున్ = ఇంకను.

భావము:

దేవతలు కోరగా వెళ్ళి దేవదానవ యుద్ధంలో రాక్షస రాజులను సంహరించి, దేవతలతో తన జీవితకాలం ఇంకా ఎంత ఉన్నది అని అడుగగా, “ఇదిగో పూర్తయిపోతోంది. ఆలస్యం లేదు. మరింకొక వరం కోరుకొనుము.” అనగా, ఖట్వాంగుడు వరాలు అడుగక మంచి విమానం ఎక్కి తన పట్టణానికి వచ్చాడు. ఖట్వాంగుడు అంతట భగవంతుని యందే మనసు లగ్నం చేసి కులదేవతలైన బ్రాహ్మణుల కంటె భార్యాపుత్రులు, ప్రాణాలు, రాజ్యాధికారం మున్నగునవి ఏవీ కూడ ప్రియమైనవి కావు. నా బుద్ధి ఎప్పుడూ ధర్మాన్ని అతిక్రమించి నడవదు. భగవంతుని గురించి తప్పించి ఇతరవిషయాలు మనసున ఉంచుకోదు.