పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-252-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వీరుఁడగు పరశురాముఁడు
ఘో కుఠారమున నృపులఁ గూలుచు వేళన్
నారీజనములు దాఁచిన
నారీకవచుం డనంగ లి నుతి కెక్కెన్.

టీకా:

వీరుడు = శూరుడు; అగు = ఐన; పరశురాముడు = పరశురాముడు; ఘోర = భయంకరమైన; కుఠారమునన్ = గొడ్డలితో; నృపులన్ = రాజులను; కూలుచు = చంపెడి; వేళను = సమయమునందు; నారీజనములున్ = స్త్రీలు; దాచినన్ = వారిమరుగునఉంచగ; నారీకవచుండు = నారీకవచుడు; అనంగన్ = అని; నలిన్ = మిక్కిలి; నుతికెక్కెను = ప్రసిద్ధుడయ్యెను.

భావము:

శూరుడు, పరశురాముడు భయంకరమైన గొడ్డలితో రాజులను చంపుతున్న సమయలో, స్త్రీలు వారి చాటున ఈ మూలకుని దాచారు. అందుచేత నారీకవచుడు అని పేరు పొందాడు.