పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-251-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సుదాసుని భార్య యగు మదయంతి వసిష్ఠునివలన గర్భిణి యై యేడేండ్లు గర్భంబు ధరించి నీళ్ళాడ సంకటపడుచున్న వసిష్ఠుండు వాఁడి యగు నశ్మంబున నా గర్భంబుఁ జీరిన నశ్మకుం డను కుమారుండు పుట్టె; నతనికి మూలకుండు పుట్టె; నతండు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సుదాసుని = సుదాసుని; భార్య = భార్య; అగు = ఐన; మదయంతి = మదయంతి; వసిష్ఠుని = వసిష్ఠుని; వలన = వలన; గర్భిణి = గర్భవతి; ఐ = అయ్యి; ఏడు = ఏడు (7); ఏండ్లు = సంవత్సరములు; గర్భంబున్ = గర్భములో; ధరించి = శిశువునుంచుకొని; నీళ్ళాడ = ప్రసవించుటకు; సంకటపడుతున్నన్ = కష్టపడుతుండగ; వసిష్ఠుండు = వసిష్ఠుడు; వాడి = సూదియైనది; అగు = ఐన; అశ్మంబున్ = రాతిచే; ఆ = ఆ; గర్భంబున్ = గర్భమును; చీరినన్ = చీల్చగా; అశ్మకుండు = అశ్మకుడు; అను = అనెడి; కుమారుండు = పుత్రుడు; పుట్టెను = జన్మించెను; అతని = అతని; కిన్ = కి; మూలకుండు = మూలకుడు; పుట్టెన్ = జన్మించెను; అతండు = అతడు.

భావము:

ఈ విధంగా సుదాసుని భార్య ఐన మదయంతి వసిష్ఠుని వలన గర్భవతి అయ్యి ఏడు (7) ఏళ్ళు గర్భంలో శిశువును ఉంచుకొని ప్రసవించుటకు కష్టపడుతుండగ వసిష్ఠుడు ఒక సూది రాయితో ఆ గర్భాన్ని చీల్చగా అశ్మకుడు అనెడి పుత్రుడు జన్మించాడు. అతనికి మూలకుడు జన్మించాడు అతడు.