పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-250-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ది కారణముగఁ బుత్రా
భ్యుయము లేదా సుదాసభూపాలునకుం
నుమతి నవ్వసిష్ఠుఁడు
యంతికిఁ గడుపుజేసె దనక్రీడన్.

టీకా:

అది = ఆ; కారణంబునన్ = కారణముచేత; పుత్రాభ్యుదయము = సంతానకలుగుట; లేదు = లేదు; ఆ = ఆ; సుదాస = సుదాసుడను; భూపాలున్ = రాజు; కున్ = కి; తత్ = అతని; అనుమతిన్ = అంగీకారముతో; ఆ = ఆ; వసిష్థుడు = వసిష్ఠుడు; మదయంతి = మదయంతి; కిన్ = కి; కడుపు = గర్భము; చేసె = చేసెను; మదనక్రీడన్ = రతికార్యముతో.

భావము:

దానితో సంతానం కలుగుట లేదు. ఆ సుదాసురాజు అంగీకారంతో వసిష్ఠుడు మదయంతికి గర్భాదానం చేసాడు.