పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-249-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తులకొఱకు నాలి రావింప నదియును
బెదరి విప్రసతి శపించు టెఱిఁగి
గని నడ్డపెట్టి మైథునకర్మంబు
మాన్చె సతుల గోష్ఠి మానె నతడు.

టీకా:

రతుల్ = సంసారసుఖము; కొఱకున్ = కోసము; ఆలిన = భార్యను; రావింపన్ = పిలిపించగా; అదియును = ఆమె; బెదిరి = భయపడి; విప్ర = బ్రాహ్మణుని; సతి = భార్య; శపించుట = శాపమిచ్చుట; ఎఱిగి = గుర్తుండి; మగనిన్ = భర్తను; అడ్డపెట్టి = వారించి; మైథునకర్మంబు = కలియుటను; మాన్చెన్ = మానిపించెను; సతులగోష్టిన్ = స్త్రీసాంగత్యమును; మానెను = వదలిపెట్టెను; అతడు = అతను.

భావము:

అలా తన రాజ్యం చేరిన ఆ రాజు సంసారసుఖం కోసం భార్యను పిలిపించాడు. ఆమె బ్రాహ్మణుని భార్య శాపం గుర్తుచేసి భర్తను వారించింది. దానితో అతను స్త్రీసాంగత్యం వదలిపెట్టాడు.