పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-247-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని కరుణ పుట్ట నాడుచు
నితామణి పలవరింప సుధాదేవుం
దినియె నతఁడు పులి పశువుం
దిను క్రియ శాపంబు కతన ధీరహితుండై.

టీకా:

అని = అని; కరుణ = జాలి; పుట్టన్ = కలుగునట్లు; ఆడుచున్ = పలుకుతు; వనితామణి = స్త్రీరత్నము; పలవరింపన్ = బతిమాలగా; వసుధాదేవున్ = విప్రుని; తినియెన్ = భక్షించెను; అతడు = అతడు; పులి = పులి; పశువున్ = పశువును; తిను = తినెడి; క్రియన్ = వలె; శాపంబు = శాపము; కతన = వలన; ధీ = వివేకము; రహితుండు = లేనివాడు; ఐ = అయ్యి.

భావము:

అని ఆ స్త్రీరత్నం ఎంత జాలి కలిగేలా బతిమాలినా, శాపం వలన వివేకం కోల్పోయిన కల్మాషపాదుడు పులి పశువును తినున్నట్లు విప్రుని భక్షించాడు.