పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-245-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తండ్రీ! మీకు దినేశవంశజులకున్ దైవం బగున్ బ్రాహ్మణుం
డండ్రా మాటలు లేవె? భూమిసుర గోత్యాభిలాషంబు గై
కొండ్రే మీ యటువంటి సాధువులు? రక్షోభావ మిట్లేల? మీ
తండ్రిం దాతలఁ బూర్వులం దలఁపవే ర్మంబునుం బోఁగదే.

టీకా:

తండ్రీ = నాయనా; మీరు = మీ(వంశస్థుల); కున్ = కి; దినేశవంశజుల్ = సూర్యవంశపువారి; కున్ = కి; దైవంబు = దేవుడు; అగున్ = అయి ఉండును; బ్రాహ్మణుండు = విప్రుడు; అండ్రు = అనెదరు; ఆ = ఆ; మాటలు = మాటలు; లేవే = అబద్ధములా; భూమిసుర = బ్రాహ్మణుల; గో = గోవుల; హత్య = సంహరించవలెనని; అభిలాషంబున్ = కోరికను; కైకొండ్రే = తలచారా, లేదు; మీ = మీ; అటువంటి = లాంటి; సాధువులు = మంచివారు; రక్షస్ = రాక్షస; భావమున్ = తత్వమును; ఇట్లు = ఇలా; ఏల = ఎందుకు (ధరించెదవు); మీ = మీయొక్క; తండ్రిన్ = నాన్నగారిని; తాతలన్ = తాతలను; పూర్వులన్ = అంతకుముందువారిని; తలపవే = తలచుకొనుము; ధర్మంబునున్ = ధర్మమార్గమున; పోగదే = నడచుకొనుము.

భావము:

నాయనా! మీ సూర్యవంశంవారికి విప్రుడు అంటే దేవునితో సమానం అంటారు కదా. అది అబద్ధమా? మీ లాంటి మంచివారు ఎక్కడైనా బ్రహ్మహత్యాపాతకం, గోహత్యాపాతకం కోరి తెచ్చుకుంటారా? ఈ రాక్షసత్వం నీ కెందుకయ్యా? మీ పెద్దలను పూర్వీకులను తలచి ధర్మమార్గాన నడచుకో వద్దా?