పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-244-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వి వంశాగ్రణివై సమస్తధరణీరాజ్యాను సంధాయివై
భునస్తుత్యుఁడవై పరార్థరతివై పుణ్యానుకూలుండవై
విరంబేమియు లేక నా పెనిమిటిన్ విప్రుం దపశ్శీలు స
త్ప్రరున్ బ్రహ్మవిదున్ జగన్నుతగుణున్ క్షింపఁగాఁ బాడియే?

టీకా:

రవివంశ = సూర్యవంశపు; అగ్రణివి = గొప్పవాడవు; ఐ = అయ్యి; సమస్త = సమస్తమైన; ధరణీ = లోకాన్ని; రాజ్యానుసంధాయివి = పాలించినవాడవు; ఐ = అయ్యి; భువన = లోకంచేత; స్తుత్యుడవు = కీర్తింపబడువాడవు; ఐ = అయ్యి; పరార్థ = పర లోక సౌఖ్యములను; రతివి = కోరిక కలవాడవు; ఐ = అయ్యి; పుణ్య = పుణ్యములను; అనుకూలుండవు = చేయువాడవు; ఐ = అయ్యి; వివరంబు = తప్పు; ఏమియున్ = ఏమాత్రము; లేక = లేకుండ; నా = నాయొక్క; పెనిమిటిని = భర్తను; విప్రున్ = బ్రాహ్మణుని; తపస్ = తపస్సు; శీలున్ = చేయుకొనువానిని; సత్ = మంచి; ప్రవరున్ = వంశమునపుట్టినవానిని; బ్రహ్మవిదున్ = బ్రహ్మజ్ఞానిని; జగత్ = లోకముచేత; నుత = స్తుతింపబడు; గుణున్ = సుగుణములుగలవానిని; భక్షింపగాన్ = తినుట; పాడియే = ధర్మమేనా, కాదు.

భావము:

అందులోనూ నీవు సూర్యవంశ మహానుభాడవు. లోకం అంతా ఏలినవాడవు. లోకులు అంతా కీర్తించేవాడవు. స్వర్గ సౌఖ్యాలను పొందగలవాడవు, పుణ్యాత్ముడవు, నా భర్త ఏ తప్పు చేయలేదు, సద్వంశ సంజాతుడు, మహాతాపసి, బ్రహ్మజ్ఞాని, స్తుతి పాత్ర సుగుణాలరాశి. అట్టి బ్రాహ్మణుని తినుట నీకు ధర్మం కాదు.