పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-243-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మానుషదేహము గలుగుట
భూనాయక! దుర్లభంబు పుట్టినమీదఁన్
దాముఁ బరోపకారము
భూనుతకీర్తియును వలదె పురుషున కెందున్?

టీకా:

మానుష = మానవ; దేహము = జన్మము; కలుగుట = పొందుట; భూనాయక = రాజ {భూనాయకుడు - భూమికి ప్రభువు, రాజు}; దుర్లభంబు = చాలాకష్టము; పుట్టిన = జన్మించిన; మీదన్ = తరువాత; దానము = దానధర్మములు; పరోపకారమున్ = పరులకుసాయంచేయుట; భూ = లోకము నందు; నుత = స్తుతింపబడిన; కీర్తియును = కీర్తి; వలదె = వద్దా, కావలయును; పురుషున్ = మానవున; కున్ = కి; ఎందున్ = ఎప్పుడైనసరే.

భావము:

“ఓ భూనాయకా! మానవజన్మ పొందుటే చాలా కష్టము. మాననజన్మ అంటూ ఎత్తాక, దానధర్మాలు, పరోపకారం చేసి లోకంలో కీర్తి పొందాలి.