పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-242-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నా బ్రాహ్మణుని భార్య మోఁదికొనుచుం బెగ్గడిల్లి, డగ్గుత్తికతోఁ బతికి నడ్డంబు వచ్చి, యేడ్చుచు రాచరక్కసున కిట్లనియె.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; బ్రాహ్మణుని = విప్రుని; భార్య = పెండ్లాము; మోదికొనుచున్ = గుండెలుబాదికొనుచు; బెగ్గడిల్లి = భయపడిపోయి; డగ్గుతిక = గద్గదస్వరము; తోన్ = తోటి; పతి = భర్త; కున్ = కి; అడ్డంబు = అడ్డము; వచ్చి = వచ్చి; ఏడ్చుచు = ఏడుస్తూ; రాచరక్కసున్ = రాజరాక్షసుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అంతట, భయపడిపోయిన ఆ విప్రుని పెండ్లాము గుండెలు బాదుకుంటూ భర్తకి అడ్డం వచ్చి ఏడుస్తూ గద్గదస్వరంతో రాజరాక్షసునితో ఇలా అన్నది.