పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-241-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆఁట మలమల మాఁడుచు
వీఁ నతం డడవి నున్న విప్ర మిథునముం
దాఁకి తటాలున విప్రునిఁ
గూఁటి చేఁబట్టి మ్రింగఁ గొనిపోవుతఱిన్.

టీకా:

ఆకటన్ = ఆకలితో; మలమల = మలమల; మాడుచున్ = మాడిపోతూ; వీకన్ = విజృంభణముతో; అతండు = అతడు; అడవిన్ = అడవిలో; ఉన్నన్ = ఉండగా; విప్ర = బ్రాహ్మణ; మిథునమున్ = దంపతులను; తాకి = ఎదుర్కొని; తటాలునన్ = అతిశీఘ్రముగ; విప్రునిన్ = బ్రాహ్మణుని; కూకటిన్ = జుట్టు; చేన్ = చేతితో; పట్టి = పట్టుకొని; మ్రింగన్ = తినివేయుటకు; కొనిపోవు = తీసుకెళ్ళెడి; తఱిన్ = సమయమునందు.

భావము:

ఆకలితో మలమల మాడిపోతూన్న అతడు, ఆ అడవిలో ఒక బ్రాహ్మణ దంపతులను చూసాడు. వెంటనే వారిని అడ్డగించి, బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని తినడానికి తీసుకుపోసాగడు. అప్పుడు...