పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-240-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు మిత్రసహుండు గావునఁ గళత్రానుకూలుండై శపియింప నొల్లక సుదాసుండు రాక్షస భావంబు నొంది, కల్మషవర్ణంబు లయిన పాదంబులతో నడవులం దిరుగుచు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; మిత్రసహుండు = స్నేహార్ద్ర హృదయుడు; కావున = కనుక; కళత్ర = భార్యకు; అనుకూలుండు = అనుకూలమైనడచువాడు; ఐ = అయ్యి; శపియింపక = శపించుటకు; ఒల్లక = ఇష్టపడకుండ; సుదాసుండు = సుదాసుడు; రాక్షసభావంబున్ = రాక్షసత్వమును; ఒంది = పొంది; కల్మష = నల్లటి; వర్ణంబులు = రంగుపొందినవి; అయిన = ఐన; పాదంబుల్ = పాదముల; తోన్ = తోటి; అడవులన్ = అడవులందు; తిరుగుచున్ = తిరుగుతూ.

భావము:

ఈ విధంగ స్నేహార్ద్ర హృదయుడు కనుక భార్యకు అనుకూలమై నడచువాడు అయ్యి శపించుటకు ఇష్టపడకుండ సుదాసుడు రాక్షసత్వాన్ని పొంది నల్లటి రంగు పాదాలతో కల్మాపాదుడై అడవిలో తిరుగుతూ....