పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-238-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు శపియించి పదంపడి, రాక్షసుండు వండి తెచ్చుటయు, సుదాసుం డెరుంగమియుఁ దన మనంబున నెఱింగి, వసిష్ఠుఁడు పండ్రెండేండ్లు రక్కసుండవయి యుండుమని నియమించె; నయ్యవసరంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; శపియించి = శపించి; పదంపడి = తరువాత; రాక్షుసుండు = రాక్షసుడు; వండి = వంటచేసి; తెచ్చుటయు = తీసుకొచ్చుట; సుదాసుండు = సుదాసుడు; ఎరుంగమియున్ = తెలియకపోవుట; తన = తనయొక్క; మనంబునన్ = మనసులో; ఎఱింగి = తెలిసి; వసిష్ఠుడు = విసిష్ఠుడు; పండ్రెండు = పన్నెండు (12); ఏండ్లు = సంవత్సరములు; రక్కసుండవు = రాక్షసుడవుగా; అయి = అయ్యి; ఉండుము = ఉండుము; అని = అని; నియమించెను = కట్టుబాటుచేసెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు;

భావము:

ఈ విధంగ శపించిన తరువాత రాక్షసుడు కావాలని ఇలా వంటచేసి తీసుకవచ్చాడని, సుదాసుడికి ఇది తెలియదని వసిష్ఠుడు తెలుసుకున్నాడు. కనుక, పన్నెండు (12) ఏళ్ళు రాక్షసుడవుగా ఉండమని శాపం సవరించాడు. ఆ సమయంలో....