పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కల్మాషపాదుని చరిత్రము

  •  
  •  
  •  

9-236-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ ఋతుపర్ణునకు సర్వకాముండును, సర్వకామునకు మదయంతీ వల్లభుండైన సుదాసుండును బుట్టె, నా రాజశేఖరుని మిత్రసహుండును, గల్మాషపాదుండు నని చెప్పుదు, రా భూవరుండు వసిష్ఠుని శాపంబున రాక్షసుడయి, తన కర్మంబున నపత్యుండయ్యె,” ననిన విని పరీక్షిన్నరేంద్రు డేమి కారణంబున సుదాసునకు గురుశాపంబు ప్రాప్తంబయ్యె” నని యడిగిన శుకుం డిట్లనియె.

టీకా:

ఆ = ఆ; ఋతుపర్ణున్ = ఋతుపర్ణుని; కున్ = కి; సర్వకాముండున = సర్వకాముడు; సర్వకామున్ = సర్వకాముని; కున్ = కి; మదయంతీ = మదయంతియొక్క; వల్లభుండు = భర్త; ఐన = అయిన; సుదాసుండును = సుదాసుడు; పుట్టెన్ = జన్మించిరి; ఆ = ఆ; రాజశేఖరుని = రాజశేఖరుని; మిత్రసహుండును = మిత్రసహుండు; కల్మాషపాదుండును = కల్మాషపాదుడు; అని = అని; చెప్పుదురు = అంటారు; ఆ = ఆ; భూవరుండు = రాజు; వసిష్ఠుని = వసిష్టునియొక్క; శాపంబునన్ = శాపమువలన; రాక్షసుడు = రాక్షసుడు; అయి = ఐ; తన = తనయొక్క; కర్మంబునన్ = కర్మానుసారము; అపత్యుండు = అపత్యుడు; అనినన్ = అనగా; విని = విని; పరీక్షిత్ = పరీక్షిత్తు; నరేంద్రుండు = మహారాజు; ఏమి = ఎట్టి; కారణంబునన్ = కారణమువలన; సుదాసున్ = సుదాసున; కున్ = కు; గురు = గురువుయొక్క; శాపంబు = శాపము; ప్రాప్తంబు = కలిగినది; అయ్యెన్ = అయ్యెను; అని = అని; అడిగినన్ = అడుగగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ ఋతుపర్ణునికి సర్వకాముడు. సర్వకామునికి మదయంతి భర్త అయిన సుదాసుడు పుట్టారు. ఆ రాజశేఖరుని మిత్రసహుడు, కల్మాషపాదుడు అని కూడ అంటారు. ఆయన వసిష్టుని శాపంవలన రాక్షసుడై తన కర్మానుసారం అపత్యుడు అయ్యాడు.” శుకుడు అనగా విని, పరీక్షిత్తు “సుదాసుకు గురుశాపం ఎలా కలిగింది.” అని అడిగాడు. అంత శుకుడు ఇలా చెప్పసాగాడు.