పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సూర్యవంశారంభము

  •  
  •  
  •  

9-7-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్కువ దక్కువ పొడవుల
కెక్కటి మొదలయిన పురుషుఁ డింతయుఁ జెడఁ దా
నొక్కఁడుఁ గల్పాంతంబున
క్కజమై నిల్చె విశ్వ తఁడై యుంటన్.

టీకా:

ఎక్కువతక్కువ = పెద్ద చిన్న; పొడవుల = ప్రాణులకు; ఎక్కటి = కేవలుడు, అద్వితీయుడ; మొదలు = మూలమైనవాడు; అయిన = ఐన; పురుషుడు = అంతరాత్మ; ఇంతయున్ = ఈ సృష్టి సమస్తమున్; చెడన్ = లయమైనను; తాన్ = తను; ఒక్కడు = ఒక్కడే ఏకాంతముగ; కల్పాంతంబునన్ = ప్రళయకాలమునందును; అక్కజము = అదికుడు; ఐ = అయ్యి; నిల్చెన్ = మిగిలియుండెను; విశ్వమున్ = సృష్టిసమస్తము; అతడు = తాను; ఐ = అయ్యి; ఉంటన్ = ఉండుటచేతను.

భావము:

కేవలుడు, అద్వితీయుడు పరమాత్మ సర్వ ప్రాణులకు మూలమైనవాడు, అంతరాత్మ. ఈ సృష్టి తానే అయ్యి ఉండుట చేత, సమస్తము లయమైనను తను ఒక్కడే ఏకాంతముగ ప్రళయకాలము నందునను మిగిలి ఉంటాడు.